VijayRashmika: విజయ్ ఇంటెన్స్ ఫైర్ చూడాలని వెయిటింగ్.. రష్మిక అదిరిపోయే ట్వీట్

VijayRashmika: విజయ్ ఇంటెన్స్ ఫైర్ చూడాలని వెయిటింగ్.. రష్మిక అదిరిపోయే ట్వీట్

విజయ్ దేవరకొండ యాక్షన్-ప్యాక్డ్ తెలుగు స్పై థ్రిల్లర్ ‘కింగ్‌డమ్’. గురువారం (జులై 31న) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్న కింగ్‌డమ్ ప్రపంచంపై అదిరిపోయే ట్వీట్ చేసింది.

‘నేనిప్పుడు జులై 31వ తేదీ కోసం వేచి ఉండలేను. విజయ్ దేవరకొండ ఇంటెన్స్ ఫైర్ చూడటానికి వెయిట్ చేస్తున్నా. ముఖ్యంగా సినిమాకు విజయ్, డైరెక్టర్ గౌతమ్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ఈ ముగ్గురు కలిసి సృష్టించిన ప్రపంచాన్ని చూడాలని ఆసక్తిగా ఉంది. అందుకు జులై 31 కోసం అస్సలు వెయిట్ చేయలేను..’ అని రష్మిక ట్వీట్ చేసింది.

ప్రస్తుతం రష్మిక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ ఫ్యాన్స్ ఈ ట్వీట్ షేర్ చేస్తూ.. 'కావాల్సిన వారి నుంచి విజయ్ అన్నకు.. అదిరిపోయే విషెస్ అందాయి.. ఇక భారీ సక్సెస్ కన్ఫార్మ్' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

గత మూడేళ్ళుగా విజయ్, రష్మిక మందన్నా డేటింగ్ రూమర్స్ ఇండస్ట్రీలో ఊపందుకున్నాయి. కొన్ని సందర్భాల్లో వీరిద్దరు డేటింగ్ చేస్తున్నట్లు, లవ్ లో ఉన్నట్లు ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ కూడా ఇస్తూ వస్తున్నారు. రీసెంట్ గా విజయ్ ఓ ఇంటర్వ్యూలో.. తన ఎమోషన్స్, గత కొన్నేళ్లుగా తాను నేర్చుకున్న సంబంధాల పాఠాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

బంధాలకు మించినది ఏదీ లేదు. గత రెండు సంవత్సరాలుగా తాను పరిణతి చెందుతున్నాని.. జీవితాన్ని ఎలా జీవించాలో కూడా నేర్చుకున్నానని చెప్పుకొచ్చారు. గతంలో ఇలా లేను. గత రెండుమూడు సంవత్సరాలు నా జీవితం నాకు నచ్చలేదు. నేను మా అమ్మ, నాన్న, నా గర్ల్ ఫ్రెండ్, స్నేహితులతో తగినంత సమయం గడపలేకపోయానని అన్నారు.