శ్రీలంకతో క్రికెట్ టోర్నీకి ఎంపికైన మెదక్ జిల్లా విద్యార్థి

శ్రీలంకతో క్రికెట్ టోర్నీకి ఎంపికైన మెదక్ జిల్లా విద్యార్థి

నిజాంపేట, వెలుగు: శ్రీలంకతో జరిగే అండర్ –-17 క్రికెట్ టోర్నీకి మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థి ఎంపికయ్యాడు. నిజాంపేట మండలకేంద్రానికి చెందిన చల్మేటి అరుణ్ సిద్దిపేటలోని గురుకృప కాలేజీలో ఇంటర్​సెకండియర్ చదువుతున్నాడు. జిల్లా హెచ్ సీఏ ప్రీ ట్రైనింగ్ లో ట్రైనర్ అరవింద్ పర్యవేక్షణలో శిక్షణ పొందతూ.. ఒడిశా,  పంజాబ్,  వైజాగ్, గోవాలో జరిగిన దేశీయ క్రికెట్ టోర్నీల్లో ఆఫ్ స్పిన్ బౌలింగ్ లో అరుణ్ సత్తా చాటాడు. ఈ క్రమంలో శ్రీలంకలో వచ్చే సెప్టెంబర్ లో జరిగే  టోర్నీలో ఐదు మ్యాచ్ లు ఆడటానికి ఎంపికయ్యాడు. టోర్నీకి ఎంపిక కావడంతో  అరుణ్ ను తండ్రి నరేందర్, గ్రామస్తులు అభినందించారు.