క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ ఆగ్రహం..కెప్టెన్సీ అవసరం లేదని స్పష్టం

క్రికెట్ ఆస్ట్రేలియాపై వార్నర్ ఆగ్రహం..కెప్టెన్సీ అవసరం లేదని స్పష్టం

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. బాల్ టాంపరింగ్లో దోషిగా తేలి కెప్టెన్సీ చేపట్టకుండా జీవితకాలం నిషేధాన్ని ఎదుర్కొంటున్న వార్నర్..నిషేధాన్ని తొలగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను వేడుకున్న వార్నర్..తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  ఇకపై కెప్టెన్సీ బాధ్యతలను తీసుకోవాలని అనుకోవడం లేదని తేల్చి చెప్పాడు. కెప్టెన్సీపై జీవిత కాల నిషేధాన్ని ఎత్తివేయాలని రివ్యూ పిటీషన్ వేసిన వార్నర్..దీనిపై ఏర్పాటైన స్వతంత్ర ప్యానెల్..కేసు విచారణను బహిరంగంగా చేపట్టాలని నిర్ణయించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు. రివ్యూ పిటీషన్ను విరమించుకుంటున్నట్లు ప్రకటించాడు. అ సందర్భంగా ఆసీస్ క్రికెట్ బోర్డు స్వతంత్ర ప్యానెల్.. కౌన్సిల్ సహాయక సిబ్బందిపై  ఆగ్రహం వ్యక్తంచేస్తూ..తన ఇన్ స్టాగ్రామ్ లో వార్నర్ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు.


  
శిక్ష అనుభవించినా..విముక్తి పొందలేకపోతున్నా..

2018లో కేప్‌టౌన్‌లో మూడో టెస్టులో బాల్ టాంపరింగ్ వల్ల తన కుటుంబం ఎంతో మనోవేదనకు గురైనట్లు వార్నర్ తెలిపాడు. తనతో పాటు..తన కుటుంబం ఎన్నో అవమానాలను భరించిందని చెప్పాడు.  నిషేధం ఉన్నా కూడా...2018 నుంచి ఇప్పటి వరకు ఆట పరంగా తనను తాను ఎంతో సంస్కరించుకున్నానని వెల్లడించాడు. క్రికెట్‌కు సేవలు అందించానని చెప్పాడు. అయినా కూడా..తాను అనుభవిస్తున్న శిక్ష నుండి ఇప్పటికీ విముక్తి పొందలేకపోతున్నానని వార్నర్ ఆవేదన వ్యక్తం చేశాడు.

క్రికెట్ కంటే కుటుంబమే ముఖ్యం

నవంబర్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా ...ఆసీస్ క్రికెట్ ప్రవర్తనా నియమావళిని సవరించింది.  సవరించిన నియమావళితో తనలో కొత్త ఆశలను రేకెత్తించిందని వార్నర్ తెలిపాడు.  నిషేధంపై సమీక్ష కోరేందుకు ఛాన్స్ దొరికిందని ఆనంద పడ్డట్లు చెప్పాడు. కానీ ఈ విషయంలో కౌన్సిల్‌ లాయర్ తనపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాడు. 2018 న్యూజిలాండ్‌  టూర్ లో ఏం జరిగిందన్న దానిపై ప్యానెల్ బహిరంగ ప్రదర్శన ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు తెలిసిందన్నాడు. ఈ  సంఘటనపై పబ్లిక్‌ ట్రయల్‌ నిర్వహించాలని ప్యానెల్‌ నిర్ణయించిందనన్నాడు. దీని వల్ల మరోసారి కుటుంబం సభ్యులు మరింత ఇబ్బంది పడే అవకాశం ఉందన్నాడు. ఆ చెత్త ఎపిసోడ్‌ను క్లీన్‌ చేసేందుకు వాషింగ్‌ మెషీన్‌లా తాను..తన కుటుంబం సిద్ధంగా లేదని వార్నర్‌ పోస్ట్లో పేర్కొన్నాడు. క్రికెట్ కంటే..తన కుటుంబమే ముఖ్యమని తేల్చి చెప్పాడు.