రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. హైదరాబాద్‌‌తో పాటు జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్‌‌లోని చాప్రాలలో 43.3 డిగ్రీలు, ఆదిలాబాద్‌‌ అర్బన్‌‌లో 43.2, కుమ్రంభీంలోని కెరమెరిలో 43.1, జగిత్యాలలోని మద్దుట్లలో 43, వనపర్తిలోని కేతేపల్లి, నిజామాబాద్‌‌లోని సిరికొండలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రానున్న నాలుగురోజులు ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్‌‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. రెండు నుంచి మూడు డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.