రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై డీసీఏ దాడులు

రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ షాపులపై డీసీఏ దాడులు
  • 196 షాపులకు షోకాజ్ నోటీసులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తం గా డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు మెడికల్ షాపులపై సోమవారం దాడులు నిర్వహించారు. నిబంధ నలు ఉల్లంఘిస్తున్న 196 రిటైల్ మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. 

ఈ స్పెషల్ డ్రైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో...  చాలా షాపుల్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే మందులు అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన బిల్లులు, రికార్డులు సరిగా నిర్వహిం చకపోవడం వంటి ఉల్లంఘనలను కనుగొన్నట్లు డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం తెలిపారు.