మెడికల్ షాప్‌పై దాడులు.. ఇట్రారోల్‌ టాబ్లెట్లు సీజ్

మెడికల్ షాప్‌పై దాడులు..  ఇట్రారోల్‌ టాబ్లెట్లు సీజ్

డ్రగ్స్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు సోమవారం వనస్థలిపురంలోని ఓ మెడికల్‌ షాప్ పై దాడులు నిర్వహించారు. రైడ్స్ లో అధిక ధరలకు విక్రయిస్తున్న రెండు రకాల మందులను సీజ్ చేశారు. డ్రగ్ కంట్రోలర్ అధికారులు రూ.5.52 లక్షల విలువైన ఇట్రారోల్‌-100 mg, ఇట్రారోల్‌ 200mg టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

డీసీఏ డైరెక్టర్ జనరల్ VB కమలాసన్ రెడ్డి ప్రకారం.. ఇట్రారోల్ -100 బ్రాండ్ పేరుతో విక్రయించే ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్, ఇట్రారోల్ -200పేరుతో విక్రయించే ఇట్రాకోనజోల్ క్యాప్సూల్స్ ధరలు డ్రగ్స్ ఆర్డర్ 2013 ప్రకారం నియంత్రణలో ఉన్నాయి. ఈ టాబ్లెట్ల రేటు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA), భారత ప్రభుత్వం నిర్ణయించిన సీలింగ్ ధరకు అనుగుణంగా ఉంటుందని DCA చీఫ్ పేర్కొన్నారు. ఆ మందులను నిర్ణయించిన ధరలకంటే ఎక్కువకు అమ్ముతున్నందుకు వీటిని సీజ్ చేశామని తెలిపారు.