కష్టపడే లీడర్కే డీసీసీ పీఠం : రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల

కష్టపడే లీడర్కే డీసీసీ పీఠం : రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల

ఎల్లారెడ్డి ,వెలుగు :  కాంగ్రెస్​ బలోపేతానికి కష్టపడే లీడర్​కే డీసీసీ ప్రెసిడెంట్​పదవి దక్కుతుందని, అందుకే అభిప్రాయ సేకరణ చేపట్టామని ఏఐసీసీ అబ్జర్వర్, రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని స్నేహ ఫంక్షన్ హాల్ లో సంఘటన్ సృజన్ అభియాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధానిని చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలన్నారు. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా కాంగ్రెస్​ పని చేస్తుందన్నారు. అనంతరం ‘ఓట్ చోర్ గడ్డి చోడ్’ రాహుల్​గాంధీ పోరాటానికి ప్రజా మద్దతు కోసం సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్​మోహన్​, పార్టీ మండలాధ్యక్షుడు కుర్మ సాయిబాబా, పార్టీ శ్రేణులు 

పాల్గొన్నారు.