
- డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు
నిర్మల్, వెలుగు: కులగణనపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాంగ్రెస్ విజయమేనని డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరిరావు అన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలకు శుక్రవారం క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టి, దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని తెలిపారు. ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తోందన్నారు. ప్రతిపక్ష నాయకులు తమ రాజకీయ మనుగడ కోసమే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఈశ్వర్, మాజీ ఎంపీపీ సాద సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.