కరోనా ఎమర్జెన్సీకి మరో మెడిసిన్

కరోనా ఎమర్జెన్సీకి మరో మెడిసిన్

కరోనా కొరలు చాస్తున్న వేళ మరో ఔషదానికి అనుమతిచ్చింది డీసీజీఐ(డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా). డీఆర్డీవో తయారుచేసిన 2-డియోక్సీ-డి-గ్లూకోజ్ (2-DG) ఔషదాన్ని అత్యవసర వినియోగానికి  అనుమతి ఇచ్చింది. కరోనా చికిత్సలో  సాధారణ నుంచి తీవ్రమైన రోగులకు ఈ మెడిసిన్ ఇవ్వొచ్చని తెలిపింది. దీనిని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్యారేటరీస్ తో కలిసి డిఆర్డీవోకి చెందిన న్యూక్లియర్ మెడిసిన్ & అలైడ్ సైన్సెస్ అభివృద్ధి చేసింది. క్లినికల్ ట్రయల్స్ లో ఈ మెడిసిన్ రోగుల వేగంగా కోలుకోవడానికి సహాయం చేస్తోందని డీఆర్డీవో వెల్లడించింది. రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని కూడా తగ్గిస్తుందని తేలింది. 2డీజీ మెడిసిన్ తో చికిత్స పొందిన రోగులలో ఎక్కువ శాతం మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు వెల్లడయ్యింది. 2డిజి మెడిసిన్ సాచేట్ లో పొడి రూపంలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. దీనిని నీటిలో కరిగించి.. నోటి ద్వారా తీసుకుంటారని తెలిపింది. ఇది వైరస్ సోకిన కణాలలో పేరుకుపోయి వైరస్ పెరుగుదలను నిరోధిస్తుందని డీఆర్డీవో వెల్లడించింది.