గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో డీసీఎం డ్రైవర్ మృతి

హైదరాబాద్ : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో డీసీఎం డ్రైవర్ చనిపోయాడు. ఈ ప్రమాదం రంగారెడ్డి జిల్లా  పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు పై జరిగింది. ఆదివారం రాత్రి షోలపూర్ నుండి ద్రాక్ష పండ్ల లోడుతో హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ ను ఏడుకొండలుగా గుర్తించారు. అయితే డెడ్ బాడీని యాక్సిడెంట్ జరిగిన చోటునుంచి 3కి.మీ దూరంలో పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఏడుకొండలు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం హస్పిటల్ కి తరలించారు.

3 km దూరంలో అనుమాన స్పద స్థితిలో పడి ఉన్న డెడ్ బాడీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యాక్సిడెంట్ చేసిన వాహనం ఆపకుండా వెళ్లినట్లు తెలుస్తుంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్ ను గుర్తించిన వాహనదారులు.. హస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేసి ఉంటారని..అయితే అతడు మార్గమధ్యలో చనిపోవడంతో.. అక్కడే వదిలేశారా..అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.