హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం బోల్తా.. ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం బోల్తా.. ట్రాఫిక్ జామ్..

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై డీసీఎం బోల్తా కొట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టైరు పంక్చరు కావడంతో  అదుపుతప్పి ఒకవైపుగా డీసీఎం పడిపోయింది. దీంతో ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. 2025 నవంబర్ 14న మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగింది ఈ ప్రమాదం. 

మేడ్చల్ కూచారం నుంచి కీసర మీదుగా యాదాద్రి జిల్లాలోని బొమ్మలరామారం వెళ్తున్న డీసీఎం ఈ ప్రమాదానికి గురైంది. అట్టల కంపెనీకి  పేపర్ బెండల్స్ తో వెళ్తుండగా మార్గ మధ్యలో టైర్ పంక్చరై ఒక్కసారిగా బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో అట్టల బండిల్స్ చెల్లా చెదురుగా పడిపోయాయి. అట్టల రోల్స్ రోడ్డుపై దొర్లుతూ వెళ్లడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. డ్రైవర్ తృటిలో ప్రమాదం తప్పింది.