మేడిపల్లి లో సైడ్ ఇవ్వట్లేదని అడిగినందుకు బస్సు కిందకు నూకేసిండు..

మేడిపల్లి లో  సైడ్ ఇవ్వట్లేదని అడిగినందుకు బస్సు కిందకు నూకేసిండు..
  •      టైర్లు ఎక్కడంతో కుడి కాలు నుజ్జునుజ్జు

మేడిపల్లి, వెలుగు: ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్​ సైడ్​ ఇవ్వకుండా నడుపుతుండడంతో డీసీఎం డ్రైవర్​ నిలదీశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరగ్గా ఆటో డ్రైవర్​.. డీసీఎం డ్రైవర్​ను బస్సు కిందకు నెట్టేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ తట్టిఅన్నారం ప్రాంతానికి చెందిన కొనుగంటి శ్రీనివాస్(51) డీసీఎం డ్రైవర్​. ఆదివారం ఉప్పల్ నుంచి ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్ కు వెళ్తున్నాడు. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్​ సైడ్​ ఇవ్వకుండా వెళ్తుండడంతో కొంచెం ముందుకు వెళ్లి వాహనం ఆపి అతడిని నిలదీశాడు. 

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో ఆటో డ్రైవర్​ శ్రీనివాస్​ను నెట్టేయడంతో ఆర్టీసీ బస్సు కింద పడి ఆయన కుడి కాలు మోకాలి వరకు నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్​ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రమాదానికి బస్సు డ్రైవరే కారణమని పొరపాటు పడ్డ స్థానికులు అతడిపై దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.