హైదరాబాద్లో మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. పలువురికి గాయాలు

హైదరాబాద్లో మరో బస్సు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన డీసీఎం.. పలువురికి గాయాలు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే చేవెళ్ల బస్సు-టిప్పర్ ప్రమాదం మిగిల్చిన విషాదం మరువక ముందే మరికొందరు డ్రైవర్లు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేస్తున్నారు. శుక్రవారం (నవంబర్ 07) ఉదయం హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తా దగ్గర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  షాద్ నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 

గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్, కండక్టర్ల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.