
మిర్యాలగూడ: కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచుతూ.. మానవత్వాన్ని కూడా మంటగలుపుతుంది. అనారోగ్యంతో చనిపోయిన వ్యక్తికి కరోనా సోకిందేమోననే అనుమానంతో.. ఆటోలో నుంచే శశ్మానానికి తీసుకెళ్లిన ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగింది. పట్టణంలోని బంగారగడ్డకు చెందిన 60 ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం బాలేక కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. మంగళవారం ఆరోగ్యం మరింత క్షీణించడంతో మృతిచెందాడు. అతని మృతదేహాన్ని కుటుంబసభ్యులు ఆటోలో తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే ఆ వ్యక్తికి కరోనా సోకిందనే అనుమానంతో అతని బంధువులు మృతదేహాన్ని ఇంట్లోకి తీసుకెళ్లకుండా ఆటోలోనే ఉంచారు. కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతుండటంతో.. కుటుంబసభ్యులు మృతదేహాన్ని ఆటో నుంచి దించకుండా.. అటునుంచి అటే శ్మశానవాటికకు తీసుకెళ్లారు. కరోనాకు భయపడి కావలసినవాళ్లు కాటికి కూడా రాకుండాపోయారు.
For More News..