హైదరాబాద్ శివారులో తీవ్ర విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్ కు ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. అమీన్ పూర్ లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో సోమవారం (నవంబర్ 03) జరిగిన ఈ ఇన్సిడెంట్ షాకింగ్ కు గురిచేసింది.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాలనీలో స్విమ్మింగ్ పూల్ కు ఈతకెళ్లిన చిన్నారులు ఊపిరి ఆడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించి దర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు. ఘటన వెనుక ఉన్న కారణాలను విశ్లేషిస్తున్నారు. ఇన్సిడెంట్ జరిగిన సమయంలో అక్కడున్న వారితో మాట్లాడి డీటెయిల్స్ రికార్డు చేసుకున్నారు. మరోవైపు చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
