నిర్మల్ జిల్లాలో ప్రేమ జంట మృతి సంచలనంగా మారింది. ప్రియురాలి ఆత్మహత్యకు మరుసటి రోజే ప్రియుడు చనిపోవడం కలకలం రేపింది. జిల్లాలోని లోకేశ్వరం మండలం వట్టోలి గ్రామానికి చెందిన ప్రేమజంట మృతి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఆదివారం (నవంబర్ 02) అఖిల (21) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మరుసటి రోజైన సోమవారం (నవంబర్ 03) నరేష్ (22) గోదావరిలో శవమై తేలాడు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
ప్రేమ జంట మృతితో వట్టోలి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చేతికొచ్చిన బిడ్డలు చనిపోయాడని వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. ఇరు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ప్రియురాలు అఖిల మృతి చెందిన వెంటనే నరేష్ గోదావరిలో శవమై తేలడం అనుమానాలకు తావిస్తోందని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్య చేసుకున్నాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
