2024 ఎన్నికల్లో హర్యానాలో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ తీరుపై, కేంద్ర ప్రభుత్వంపై మరోమారు సంచలన ఆరోపణలు చేశారు. ఒక్కనియోజవకర్గంలో 10 బూత్ లలో నకిలీ ఓట్లు, చనిపోయినవాళ్ల ఓట్లు, డేటా లోపాలతో దాదాపు 22 ఓట్లు ఉన్నాయని, ఆ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని ఆరోపించారు. ఈ విషయంపై ఎలక్షన్ కమిషన్ అధికారులు వాస్తవమే అని ఒప్పుకున్నారు. డిజిటలైజేషన్ లేదా ఓటరు డేటాను ఎంట్రీ చేసే సమయంలో ఆపరేటర్ స్థాయి లోపాల కారణంగా ఫోటో తారుమారు అయి ఉండొచ్చని చెబుతున్నారు. ఇది రాహుల్ గాంధీ చేసిన ఓటు చోరి ఆరోపణ.. ఫేక్ IDలతో కొంత ఓట్ చోరీ జరిగిండొచ్చని అనుమానాలకు తావిస్తోంది.
రాహుల్ గాంధీ ఆరోపించిన 22 నకిలీ ఓట్లలో కేవలం రెండు మాత్రమే ఓటరు స్వయంగా ఓటు వేసినట్లు తేలింది. మిగతా వన్నీ మరణించిన వారి ఓట్లు, వినియోగించబడని ఓట్లు.. వీటితో ఓట్ చోరీ జరిగిండొచ్చు. రెండు రోజుల పాటు ఇండియా టుడే రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మచ్రోలి ,పొరుగు గ్రామాలను సందర్శించింది. బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఉన్న ఆరు వేర్వేరు ఓటరు కేసులను గుర్తించింది. బ్రెజిలియన్ మోడల్ ఫోటో ఉన్న ఆరు వేర్వేరు ఓటరు కేసులలో క్లరికల్ లోపాలు, పాత రికార్డులు,డేటా తారుమారు వంటి ఎలక్షన్ కమిషన్ లోపాలను బయటపెడుతున్నాయి. ఇది పలు అనుమానాలకు తావిస్తోంది.
►ALSO READ | రూ.1800 కోట్ల భూమి రూ.300 కోట్లకే?..పూణేలో భారీ ల్యాండ్ డీల్ వివాదం..మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం
రాహుల్ గాంధీ బ్రెజిలియన్ మహిళ ఫేస్ తో మొత్తం 22 ఫేక్ నకిలీ ఓట్లను గుర్తించగా.. ఐదు కేసుల్లో రెండింటిలో ఓటర్లు తమ ఫోటోలు తప్పుగా ముద్రించబడ్డాయని అంగీకరించారు.అయితే వారు తమ ఓటును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఇక మిగతావీ అన్నీ అనుమానాస్పదమే.. పలు అనుమానాలకు తావిచ్చే విధంగానే ఉన్నాయి. చనిపోయిన వారి పేరుతో బ్రెజిలియన్ మహిళ ఫొటో, మరో చోట ఒకే వ్యక్తికి రెండు ఓటరు కార్డులు, మరోచోట 25ఏళ్ల క్రితం పెళ్లి చేసుకొని వెళ్లిపోయిన అమ్మాయికి ఓటు..ఇవన్నీ చూస్తే డేటా ఎర్రర్లు,ఓటరు జాబితాలో అవకతవకలను సూచిస్తున్నాయి.
రాహుల్ గాంధీ ఆరోపించిన ప్రజాస్వామ్యం తారుమారు చేశారు అన్న మాట వాస్తవంగా అనిపిస్తోంది. బ్రెజిలియన్ మహిళా ఫోటో కుట్రపూరితమైన దానికంటే ఎక్కువ అని సూచిస్తుంది.. భారతదేశ ఓటరు డేటాబేస్ లోపల డేటా నిర్వహణ సంక్షోభాన్ని బయటపెడుతుంది.
