ఎల్ఆర్ఎస్​కు ముగిసిన గడువు

ఎల్ఆర్ఎస్​కు ముగిసిన గడువు

హైదరాబాద్, వెలుగు: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ( ఎల్ఆర్ఎస్ ) గడువు శనివారంతో ముగిసింది. రాష్ర్టవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలతో కలిపి 5 లక్షల 75 వేల 965 మంది ఫీజు చెల్లించగా మొత్తంగా రూ.1988 కోట్లు ఫీజు వసూలు అయినట్టు డీటీసీపీ ( డైరెక్టర్ టౌన్ కంట్రీ ప్లానింగ్ ) అధికారులు చెబుతున్నారు.  

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25 లక్షల అప్లికేషన్లు రాగా కేవలం 6 లక్షల లోపు అప్లికెంట్లు  మాత్రమే ఫీజు చెల్లించారు. గడువు పొడిగించాలని డీటీసీపీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని త్వరలో నిర్ణయం వెలువడుతుందని అధికారులు చెబుతున్నారు. ఎల్ఆర్ఎస్ గడువును ఇప్పటికే మూడు సార్లు పెంచగా ఇప్పుడు పెంచితే నాలుగో సారి కానుంది.