హైదరాబాాద్ : అప్పు తీసుకున్న వ్యక్తి ఆ డబ్బులను తిరిగి ఇవ్వకుండా తిట్టడంతో మనస్థాపానికి గురై వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కేపీహెచ్ బీ పీఎస్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ లక్ష్మీ నారాయణ తెలిపారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా నల్లాజీర్ల గ్రామానికి చెందిన పృథ్వీ గణేశ్‌కు 2011 మే 5న కృష్ణవేణి(31)తో పెళ్లైంది. గణేశ్, కృష్ణవేణి దంపతులు ఆరేళ్లుగా కేపీహెచ్ బీలోని ధర్మారెడ్డి కాలనీలో ఉంటున్నారు. గణేశ్హైటెక్ సిటీ ప్రాంతంలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఏపీలోని జగ్గయ్య పేటకు చెందిన వెలుపల సతీశ్ 8 నెలల క్రితం గణేశ్వద్ద రూ.9లక్షలు అప్పు తీసుకున్నాడు. సతీశ్తనకు తెలిసిన వ్యక్తి కావడంతో గణేశ్ అతడికి అప్పు ఇచ్చాడు. రెండు నెలల్లో తీసుకున్న డబ్బులు ఇచేస్తానని చెప్పిన గణేశ్..గడువు తేదీ ముగిసినా ఇవ్వకుండా వాయిదాలు పెట్టసాగాడు. గణేశ్డబ్బులు గురించి అడగడంతో ఈ నెల 9న సాయంత్రం 7గంటలకు కేపీహెచ్ బీలోని తన ఇంటికి డబ్బులు తీసుకోవాలని సతీశ్ అతడికి ఫోన్ చేసి చెప్పాడు. గణేశ్ తన భార్య కృష్ణవేణి, ఫ్రెండ్ బాలాజీతో కలిసి ఈ నెల 9నసతీశ్ఇంటికి చేరుకున్నాడు.
అప్పటికే మద్యం మత్తులో ఉన్న సతీశ్ వారిని చూడగానే అసభ్యకరంగా తిడుతూ వారిపై గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. దీంతో గణేశ్దంపతులు, ఫ్రెండ్ బాలాజీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సతీశ్ అదే రోజు రాత్రి 8.30గంటలకు గణేశ్ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. తననే డబ్బులు అడుగుతావా అంటూ గణేశ్ఫోన్ పగులగొట్టాడు. ఇదే సమయంలో గణేశ్ భార్య కృష్ణవేణి మా డబ్బులు ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నావ్ అని సతీశ్‌ను నిలదీసింది. తాగిన మైకంలో సతీశ్ఆవేశంతో కృష్ణవేణిని అసభ్యకరంగా తిట్టాడు. మనస్థాపానికి గురై కృష్ణవేణి సోమవారం తెల్లవారుజామున 5.50గంటలకు భర్త గణేశ్ఇంట్లో నిద్రపోతుండగా..మరో గదిలోకి వెళ్లి సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన గణేశ్స్థానికుల సాయంతో కృష్ణవేణిని రెమిడీ హాస్పిటల్ కు తరలించాడు. కృష్ణవేణిని పరీక్షించిన డాక్టర్లు ఆమె అప్పటికే చనిపోయినట్లు తెలిపారు. కృష్ణవేణి డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. ఆమె భర్త గణేశ్ ఇచ్చిన కంప్లయింట్ మేరకు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.