మయన్మార్‌‌లో 19 మందికి ఉరిశిక్ష

మయన్మార్‌‌లో 19 మందికి ఉరిశిక్ష
  • మిలటరీ ఆఫీసర్‌‌ను చంపినందుకు ఆర్మీ చర్యలు

నైపితా: మయన్మార్ ఆర్మీ 19 మందికి ఉరి శిక్ష విధించింది. ఆర్మీ ఆఫీసర్‌ను చంపినందుకు ఈ శిక్ష వేసింది. ఈ మేరకు మిలటరీ చానెల్ వెల్లడించింది. మార్చి 27న యాంగాన్ జిల్లాలో హత్య జరిగినట్లు పేర్కొంది. కాగా, ఆర్మీ జరిపిన కాల్పుల్లో శుక్రవారం మరో 20 మంది వరకు చనిపోయారు. ఇప్పటి వరకు 614 మందిని ఆర్మీ చంపిందని.. 2,800 మందిని నిర్బంధించిందని అసిస్టెన్స్ అసోసియేషన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) గ్రూప్ తెలిపింది. మరోవైపు దేశంలో ఆందోళనలు తగ్గాయని, ప్రజలు శాంతి కోరుకుంటున్నారని ఆర్మీ ప్రకటించింది. రెండేండ్లలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. మిలటరీ కాల్పుల్లో ఇప్పటి వరకు 248 మంది చనిపోయారని ఆర్మీ ప్రతినిధి బ్రిగేడర్ జనరల్ ఝా మిన్ తున్ చెప్పారు. ఆందోళనల్లో 16 మంది పోలీసులు కూడా చనిపోయారన్నారు.