స్టూడెంట్‌పై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

స్టూడెంట్‌పై అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్‌కు ఉరిశిక్ష

తమ స్కూళ్లో చదువుతున్న బాలికపై అత్యాచారం చేసినందుకు ఆ స్కూల్ ప్రిన్సిపాల్‌కు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘటన పాట్నాలో జరిగింది. స్థానికంగా ఉన్న ఫుల్వారీ షరీఫ్ ప్రాంతంలోని ఓ పాఠశాలలో 11 సంవత్సరాల బాలిక 5వ తరగతి చదువుతోంది. ఆ పాఠశాలలో అరవింద్ కుమార్ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తుండగా.. అభిషేక్ కుమార్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అయితే ప్రిన్సిపాల్ అరవింద్ కుమార్.. సెప్టెంబర్ 2018లో బాలికపై అత్యాచారం చేశాడు. బాలికను బెదిరిస్తూ పలుమార్లు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. ప్రిన్సిపాల్ దారుణానికి.. అదే స్కూళ్లో టీచర్‌గా పనిచేస్తున్న అభిషేక్ కుమార్ సహకరించాడు. కాగా.. కొన్ని రోజుల తర్వాత బాలిక తీవ్ర అస్వస్థతకు గురికావడంతో.. బాలిక తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్ళారు. అక్కడ వైద్యుడు పరీక్షలు చేయగా.. బాలిక గర్భవతి అని తేలింది. దాంతో బాలిక తల్లి ఏం జరిగిందో చెప్పాలని అడిగితే అసలు విషయం బయటపడింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. ప్రిన్సిపాల్‌ను, టీచర్‌ను అరెస్ట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి పాట్నా కోర్టు.. ప్రిన్సిపాల్‌కు మరణశిక్షను విధిస్తూ.. లక్ష రూపాయల ఫైన్ కూడా కట్టాలని తీర్పు చెప్పింది. అదేవిధంగా ఆయనకు సహకరించిన ఉపాధ్యాయుడికి రూ. 50,000 జరిమానాతో పాటు జీవిత ఖైదు విధించారు.

For More News..

ఒకదానికొకటి ఢీకొన్న పలు వాహనాలు.. అయిదుగురు మృతి

కంప్యూటర్ వర్క్ చేసే వాళ్లు ఇలా చేస్తే చేతి వేళ్లకు బెటర్

ప్రభుత్వ భూములు కబ్జాలు చేస్తున్రు.. కట్టేస్తున్రు..