
తమిళనాడు కల్తీ సార ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకు పెరుగుతోంది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 34 కు చేరింది. పలు ఆస్పత్రిల్లో ఇంకా 60 మంది వరకు చికిత్స పొందుతున్నారు. వీరిలో చాలామంది హెల్త్ కండిషన్ సీరియస్ గా ఉందని అంటున్నారు అధికారులు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు హాస్పిటళ్ల దగ్గర కన్నీరుమున్నీరవుతున్నారు.
కల్తీ మద్యం ఘటనపై సీరియస్ గా స్పందించింది స్టాలిన్ సర్కార్. ఇంతమంది చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు తమిళనాడు . ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేశామని ట్వీట్ చేశారు. మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున ప్రకటించారు. మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్‌దాస్‌తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది.
తమిళనాడులోని కల్లకురిచి జిల్లా కరుణాపురంలో జూన్ 19న రాత్రి కల్తీ మద్యం తాగడంతో పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా సేలం, పుదుచ్చేరి, విల్లుపురంలోని హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ట్రీట్మెంట్ పొందుతున్న వారిని పరామర్శించారు జిల్లా కొత్త కలెక్టర్ ప్రశాంత్