రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేయాలి : మహేశ్ కుమార్ గౌడ్

రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు చేయాలి :  మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణ మాఫీకి మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నందున తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకోవాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఇదే సమయంలో దీన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని శనివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఆర్థిక అవాంతరాలను అధిగమించి రూ. 31 వేల కోట్ల రుణ మాఫీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో వరుసగా రెండ్రోజుల పాటు  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల, రైతుల పక్షాన సంబురాలు చేసుకోవాలన్నారు. అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో సంబరాలు, మీడియా సమావేశాలు నిర్వహించాలని పార్టీ కేడర్ కు సూచించారు.