రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం​

రుణమాఫీ చేసి తీరుతం : మంత్రి పొన్నం​
  • హరీశ్..​రాజీనామా పత్రంతో రెడీగా ఉండు 

హైదరాబాద్/కోహెడ, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి చెప్పినట్టుగా ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. వచ్చే వానాకాలం పంటకు రైతులకు రూ.500 బోనస్ కూడా ఇస్తామన్నారు. మాజీ మంత్రి హరీశ్​రావు తన రాజీనామా పత్రంతో రెడీగా ఉండాలని ఆయన సూచించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో ఆ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి ఆయన ప్రచారం చేశారు. 

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని హైస్కూల్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం మాట్లాడారు. ఫిబ్రవరి 23, 2023న రైతులకు రూ.4 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అప్పటి మంత్రి హరీశ్ రావు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు అయినా కట్టించారా అని పొన్నం నిలదీశారు. డబుల్ బెడ్రూం ఇండ్లు ఉన్న ఊళ్లలో మేం ఓట్లు అడగమని, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదని ఆయన అన్నారు. 

రాముడి ఫొటోతో బీజేపీ ఓట్లు అడుగుతోందని, పదేండ్లలో తెలంగాణకు ఏం చేసిందో చెప్పాకే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలతోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ని తొలగించారని పొన్నం ఆరోపించారు. గత ఎన్నికల్లో భార్య మీది మంగళ సూత్రం అమ్ముకున్నోళ్లకు ఇప్పుడు పైసల కట్టలు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు.  

చేనేత కార్మికుల ఆత్మహత్యలకుకారణం ఎవరు?

చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం 4 నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమా? గత పదేండ్లలో బీఆర్ఎస్​చేసిన పాపమా? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు. వాళ్లు చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా అప్పుగా పెట్టిన పాపం బీఆర్​ఎస్​ది కాదా అని ఫైర్ అయ్యారు. వారి డబ్బులు ఆనాడే చెల్లించి ఉంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడేది కాదని అన్నారు. శుక్రవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను స్వయంగా నేతన్నలతో సమావేశమై, వారి సమస్యలను సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. 

మొదటి దశలో రూ.50 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించామన్నారు. వచ్చే నెల మొత్తం బకాయిలు చెల్లించేలా ప్రణాళికలు చేసుకున్నామని తెలిపారు. చనిపోతున్న కార్మికులకు ధైర్యం ఇవ్వాల్సింది పోయి.. వారు అధైర్యపడేలా రాజకీయ లబ్ధి కోసం శవ రాజకీయాలు చేయడంపై మంత్రి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2014 నుంచి 20-23 మధ్య కాలంలో 135 మంది చేనేత కార్మికులు చనిపోయారని మంత్రి తెలిపారు. వారి వివరాలు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కి పంపిస్తానని ఆయన చెప్పారు.

హరీశ్..​రాజీనామా పత్రంతో రెడీగా ఉండు: మంత్రి పొన్నం​