నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించండి..కలెక్టరేట్ ఎదుట గ్రామస్తుల ధర్నా

నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించండి..కలెక్టరేట్ ఎదుట  గ్రామస్తుల ధర్నా

కరీంనగర్ టౌన్, వెలుగు: గంగాధర మండలంలోని నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు సోమవారం కరీంనగర్​ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం పెద్ద సంఖ్యలో మహిళలు ప్రజావాణికి చేరుకుని కలెక్టర్‌‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. నారాయణపూర్ రిజర్వాయర్ కారణంగా తమ ఇళ్లలోకి నీరు వస్తోందని, 15 ఏళ్లుగా అధికారులకు సమస్యలు వివరించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.