ఇండియా క్రికెటర్లను వెంటాడుతున్న గాయాలు

ఇండియా క్రికెటర్లను వెంటాడుతున్న గాయాలు

న్యూఢిల్లీ: ఇండియా క్రికెటర్లను గాయాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌కు గాయమైంది. దాంతో, సౌతాఫ్రికాతో చివరి రెండు వన్డేలకు అతను దూరం కానున్నాడు.  తొలి మ్యాచ్‌‌కు  ముందు జరిగిన ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో అతని చీలమండ బెణికింది. దాంతో, తొలి మ్యాచ్‌‌లో అతను ఆడలేదు. అయితే, చహర్‌‌ గాయం అంత పెద్దదేమీ కాదని, కొన్ని రోజులు రెస్ట్‌‌ తీసుకుంటే తగ్గిపోతుందని జట్టు వర్గాలు చెప్పాయి.

చహర్‌‌  టీ20 వరల్డ్‌‌కప్‌‌ స్టాండ్‌‌బై లిస్ట్‌‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో  సఫారీలతో  చివరి రెండు వన్డేల్లో అతడిని ఆడించి టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ రిస్క్‌‌ తీసుకునే చాన్స్‌‌ లేదు. ఇక, గాయంతో వరల్డ్‌‌కప్‌‌కు దూరమైన బుమ్రా ప్లేస్‌‌లో జట్టులోకి వస్తాడని అనుకుంటున్న  మహ్మద్‌‌ షమీ నెమ్మదిగా మ్యాచ్‌‌ ఫిట్‌‌నెస్‌‌ సాధిస్తున్నాడు. మూడు, నాలుగు రోజుల్లో తను ఆసీస్‌‌ వెళ్లి జట్టుతో కలుస్తాడని బోర్డు వర్గాలు చెప్పాయి. ఇక, టీ20 వరల్డ్‌‌ కప్‌‌లో ఇండియాకు నెట్‌‌ బౌలర్లుగా ఎంపికైన యంగ్ పేసర్లు ముకేశ్‌‌ చౌదరి, చేతన్‌‌ సకారియా ఆసీస్​ వెళ్లారు.