
పటాకుల పండుగ వచ్చేసింది.. అదేనండి దీపావళి పండుగను ఈ నెల 20 వ తేదీన జరుపుకుంటున్నాం. పిల్లలందరూ టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటారు. సంతోషంగా టపాసులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అజాగ్రత్తతలో ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏమీ కాదులే అనుకోవడం వల్లనే ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కొద్ది పాటి జాగ్రత్తలను పాటించకుండా ఇష్టం వచ్చిన విధంగా దీపావళి టపాసులు పేలిస్తే ఒక్కోసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. పిల్లలు, టీనేజర్లకు పెద్దలు ఈ విషయాలను తప్పక చెప్పాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు
- పటాకులను ఎప్పుడూ ఆరు బయట మాత్రమే కాల్చాలి..
- పటాకులు కాల్చేప్పుడు కళ్లడా లు ధరిస్తే కంటికి ఏ విధమైన ప్రమాదమూ ఉండదు.
- పటాకులు కాల్చిన తర్వాత పరిశుభ్రమైన నీటితో చేతులు కడుక్కోండి.
- పిల్లలు పటాకులతో ఆడుతు న్నప్పుడు పెద్దల పర్యవేక్షణ అవసరం.
- ఎలాంటి గాయమైనా అశ్రద్ధ చేయరాదు. డాక్టర్ల సూచనలు పాటించడం తప్పనిసరి.
- అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవిస్తే అర్చడానికి ఓ బకెట్ నీళ్లు, ఇసుకను సిద్ధంగా ఉంచు కోవాలి.
- పటాకుల బాక్సుల్ని చిన్నారులకు అందకుండా దూరంగా ఉంచండి.
- మతాబులు కాల్చేప్పుడు ముఖం, జుట్టు, బట్టలకు దూరంగా ఉండేలా చూసుకోవా
- పటాకులు కాల్చినప్పుడు సింథటిక్ వస్త్రాలను ధరించ కూడదు.
- వదులుగా ఉన్న దుస్తులను ధరించొద్దు.
- పటాకులు కాల్చేప్పుడు వాటికి కొంచెం దూరంలో ఉండటం మంచిది.