Diwali Special: సంప్రదాయాల పండుగ.. దీపావళి ఎక్కడ ఎలా జరుపుకుంటారంటే..!

Diwali Special: సంప్రదాయాల పండుగ.. దీపావళి ఎక్కడ ఎలా జరుపుకుంటారంటే..!

దీపావళి అంటే నక్షత్రాలన్నీ భువికి దిగివచ్చేరోజు. ప్రతి ఇంటా నవ్వుల దీపాలు వెలిగేరోజు. పిల్లలతోపాటు... పెద్దలూ.. పిల్లలుగా మారి సరదాగా గడిపేరోజు. మతాలకతీతంగా దేశం మొత్తం ఈ కాంతుల పండుగని ఘనంగా జరుపుకుంటుంది.  చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతం ఒక్కటే దీని కాన్సెప్ట్. కాకపోతే ఈ పండుగను జరుపుకునే తీరు కొన్ని ప్రాంతాల్లో కాస్త భిన్నంగా ఉంటోంది.

నరకాసుర వధ : దీపావళి పండుగ జరుపుకోవడానికి కారణంగా చెప్పుకునే సరకాసుర వధ. శ్రీకృష్ణుడి విజయానికి సంకేతంగా గోవా ప్రజలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటారు. ఉదయం లేచి స్నానం, పూజలు చేస్తారు. ఆపై ముఖ్యఘట్టం నరకాసురుడి  దిష్టిబొమ్మ దహనం చేస్తారు. దిష్టిబొమ్మని వీధుల్లో ఊరేగించి చివరికి ఒక ప్రదే శంలో దహనం లేదా శిరస్సు ఖండన చేస్తారు. ఈ తతంగం అంతా సూర్యో దయానికి ముందే జరుగుతుంది.

శివాజీ కోట :  వారం ముందుగానే మహారాష్ట్రలో దీపావళి సందడి షురూ అవుతుంది. పిల్లలు బురదతో కోటల్ని తయారు చేస్తారు. ఆ కోటల చుట్టూరా పచ్చని మొక్కల్ని నాటుతారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీటి మడుగులో వీటిని ఉంచుతారు. పండుగకి గ్రీన్ కోటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. శివాజీ, జీజాబాయి ప్రతిమలు, సైన్యం, ఆయుధాల బొమ్మల్ని కూడా ఏర్పాటు చేస్తారు. ఛత్రపతి శివాజీ విజయాలకు ప్రతీకగా దీపావళికి ఈ కోటల్ని ఏర్పాటు చేయటం అనవాయితీగా వస్తోంది. ఇప్పుడది చరిత్ర పాఠాలు బోధించేందుకు మార్గాన్ని సులభతరం చేసింది.  రాత్రిపూట విద్యుత్ దీపాల అలంకరణలో ఇవి మిరుమిల్లు గొలుపుతుంటాయి.


తంబీల స్పెషల్ : నరక చతుర్దశినే తమిళ ప్రజలు దీపావళికి ప్రామాణికం గా తీసుకుంటారు. పొద్దున్నే లేచి కుండల్లో నీటిని వేడి చేసి ఇంటిని శుభ్రం చేస్తారు. రంగు రంగుల ముగ్గులతో ప్రాంగణాన్ని అందంగా తీర్చి దిద్దుతారు. ఆ తర్వాత కుండలకు అలంకరణ చేస్తారు. ఇప్పుడు కుండల స్థానంలో బాయిలర్లను ఉపయోగిస్తున్నారు. శీకాకాయ తో తలంటు స్నానం మరో ప్రత్యేకత.  ఇంటి పెద్ద మిగతా సభ్యుల్ని కుర్చీల్లో కూర్చోబెట్టి పరుసపెట్టి తలస్నానం చేయిస్తాడు. తర్వాత దేవుడికి నువ్వుల నూనె, ఉసిరికా యలు మిఠాయిలు సమర్పిస్తారు. జీర్ణశక్తిని ఆరోగ్యంగా ఉండే దీపావళి లేహ్యాన్ని తింటారు. దీపావళికి తంబీలు నాన్-వెజ్ కూడా లాగిస్తారు.


ఘరోందాస్ :  పురాణాల ప్రకారం రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత తిరిగి అయోధ్యకి వస్తాడు. ఆ రోజును రాజ్య ప్రజలు. -దీపాలు వెలిగించి పండుగలా జరుపుకుంటారు. ఉత్త రప్రదేశ్, జార్ఖండ్, బిహార్ రాష్ట్ర ప్రజలు దీపావళి వెనుక ఉన్న కథ ఇదేరిని నమ్ముతారు. పండుగ రోజున ఇళ్లలో బురద ఇంటి ప్రతిమలను ఏర్పాటు చేస్తారు. ఈ సంప్రదా యాన్ని 'ఘరోందాస్' అంటారు. అంటే దేవుడికి స్వాగతం. పలకడం అని అర్థం. కాలక్రమేణా ఇప్పుడు పిల్లలు ఈ ఇళ్లును బొమ్మల కొలువుగా మార్చేస్తున్నారు. బురదకి బదులుగా ధర్మకోల్ షీట్లు.. ప్లాస్టిక్​ ...  చెక్కలతో చేసిన రెడీమేడ్ ఇళ్లను మార్కెట్లో అమ్ముతున్నారు కొందరు..


బుద్ధి దీపావళి :  దీపావళి పండుగ నెలరోజుల తర్వాత. హిమాచల్ ప్రదేశ్​ లో  వేడుకలు చేసుకుంటారు దీనిని బుద్ధి దీపావళి అని పిలుస్తుంటారు. రాముడు వనవాసం ముగిసి అయోధ్యకి వచ్చాక.. సమాచారం నెలరోజులకు ఇక్కడి ప్రజలకు తెలిసిందట.  అప్పటి నుంచి తరతరాలుగా అలస్యంగా ఇక్కడి ప్రజలు దీపావళిని ఇరుపుకుంటున్నారు. పెద్ద తాడుతో మాన వహారంగా ఏర్పడి అక్కడి ప్రజలు నృత్యాలు వేస్తారు. బయటివాళ్లకు ఇందులో అనుమతి ఇండదు. బంతు బలి కొన్నేళ్లుగా సంప్రదాయంగా కొనసాగింది. అయితే హైకోర్టు ఆదేశాలతో కొబ్బరికాయ కొట్టడంతోనే ఇప్పుడు సరిపెడు తున్నారు