
షాంఘై: ఇండియా స్టార్ ఆర్చర్ దీపిక కుమారి, పార్థ్ సాలుంఖే.. ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్–2లో కాంస్య పతకాలతో మెరిశారు. ఆదివారం జరిగిన విమెన్స్ రికర్వ్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్‌లో దీపిక 7–3తో కాంగ్ చే యంగ్ (కొరియా)పై గెలిచింది.
మెన్స్ రికర్వ్ ప్లే ఆఫ్‌లో పార్థ్ 6–4తో బాప్టిస్ట్ అడ్డిస్ (ఫ్రాన్స్)పై నెగ్గి కెరీర్‌లో తొలి వరల్డ్ కప్ మెడల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఇండియా మొత్తం ఏడు పతకాలతో ఈ టోర్నీని ముగించింది.