దీపిక డబుల్ ధమాకా

దీపిక డబుల్ ధమాకా

బాగ్దాద్: ఇండియా స్టార్ ఆర్చర్ దీపిక కుమారి తిరిగి విజయాల బాట పట్టింది.  తల్లయిన తర్వాత 14 నెలల పేలవ ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టాప్ పెడుతూ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌1లో రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిసింది.ఈ టోర్నీలో ఇండియా 10 గోల్డ్ సహా మొత్తంగా 14 మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రికర్వ్ విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ఫైనల్లో దీపిక  6–2తో సిమ్రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీత్ కౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించింది. తర్వాత  దీపికతో కూడిన విమెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5–4తో షూటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉజ్బెకిస్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఏపీ కుర్రాడు బొమ్మదేవర  ధీరజ్7–3తో ఇండియాకే చెందిన తరుణ్​దీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నెగ్గాడు.