ప్రముఖ హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి చిత్రంలో ప్రాధాన్యత కలిగిన పాత్రలో బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ దీపికా పదుకునే నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మంచి హిట్ అయ్యింది.
కాగా ఇటీవలే నటి దీపికా కి చెందిన కేఏ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో 1845 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను ₹17.7 కోట్లకు కొనుగోలు చేసింది.
అయితే రణవీర్ సింగ్ తల్లి కూడా ముంబైలోని బాంద్రా పరిసర ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటోంది. దీంతో దీపికా పదుకునే కూడా తన అత్తింటి వారికి అందుబాటులో ఉండేందుకు సమీపంలో ఉన్న ఫ్లాట్ ని కొనుక్కున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం ఇలా ఉండగా నటి దీపికా పదుకునే పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. దీంతో సినిమా షూటింగులకు విరామం ఇచ్చింది.