లేడీ సింగం వచ్చేసింది.. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక

లేడీ సింగం వచ్చేసింది.. పవర్ఫుల్ పోలీస్ పాత్రలో దీపిక

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి(Rohit shetty) డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం ఎగైన్(Singham again). అజయ్‌ దేవగన్(Ajay devgan),అక్షయ్ కుమార్(Akshay kumar), రణ్‌వీర్ సింగ్(Ranveer singh) ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమాలో స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె(Deepika padukone) హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఆమె ఈ సినిమాలో లేడీ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే చెప్పుకొచ్చారు.  

Also Read : ఆసక్తిరేపుతున్న హాయ్ నాన్న టీజర్.. డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న నాని

తాజాగా ఈ సినిమా నుండి దీపికా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. రౌడీ నోట్లో గన్ను పెట్టి నవ్వుతూ ఉన్న ఉన్న దీపిక ఫస్ట్‌లుక్‌ నెక్స్ట్ లెవల్లో ఉంది. అంతేకాదు పోలీస్ గెటప్ లో చాలా పవర్ఫుల్ గా కనిపిస్తోంది దీపికా. ఫస్ట్‌లుక్కే ఈ రేంజ్‌లో ఉదంటే.. ఇక సినిమాలో దీపిక క్యారెక్టర్‌ను ఏ రేంజ్‌లో ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం దీపికా కు సంబందించిన ఈ పోస్టర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. మరి రిలీజ్ తరువాత ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అందుకోనుందో చూడాలి.