
బషీర్ బాగ్, వెలుగు : ఈ నెల 22న అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సీతారాంబాగ్ ఆలయంలో శ్రీ సీతారామ్ మహారాజ్ సంస్థాన్, దేవాలయ రక్షణ సమితి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు దేవాలయ రక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కంభలేకర్ సందీప్ కుమార్ తెలిపారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో కార్యక్రమ బ్రోచర్‌ను ఆయన ఆవిష్కరించారు.
అనంతరం కమలేశ్ ఆచార్య మహంత్, ఆచార్య గంగోత్రి రామానుజ దాస్‌తో కలిసి వారు మాట్లాడారు. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పండగ సందర్భంగా బంధువులతో కలిసి సీతారాంబాగ్ ఆలయానికి వచ్చి శ్రీరాముడి కోసం దీపం వెలిగించి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొని రాముడిని పూజించి
హనుమాన్ ఆశీస్సులు పొందాలని కోరారు. సీతారాం బాగ్ ఆలయంతో పాటు సమీపంలోని ఆలయాల్లో కూడా దేవాలయ రక్షణ సమితి ద్వారా దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.