హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అథ్లెట్ జివాంజి దీప్తి ఫెడరేషన్ కప్ అండర్20 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మరో పతకం సాధించింది. గుజరాత్ నడియాడ్‌లో శనివారం జరిగిన విమెన్స్ 200 మీటర్ల ఈవెంట్‌లో ఆమె బ్రాంజ్ గెలిచింది. ఫైనల్లో దీప్తి 24.63 సెకండ్లతో మూడో స్థానంలో నిలిచి మెడల్ సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన 100 మీటర్ల ఈవెంట్‌లో దీప్తి సిల్వర్ నెగ్గింది.

