దామగుండం అటవీ ప్రాంతంలో .. కుక్కల దాడిలో జింక మృతి

దామగుండం అటవీ ప్రాంతంలో .. కుక్కల దాడిలో జింక మృతి

పరిగి, వెలుగు: వికారాబాద్​జిల్లా దామగుండం అటవీ ప్రాంతంలో కుక్కల దాడిలో జింక మృతి చెందింది. వేసవి తాపాన్ని తట్టుకోలేక బుధవారం ఓ జింక గుండంలో నీరు తాగేందుకు వచ్చింది. గమనించిన వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి. 

జింక మృతి చెందింది. పర్యాటకులు దామగుండంలోని రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చి అక్కడ తినుబండారాలు వేస్తున్నారు. వాటి కోసం వస్తున్న కుక్కలు జింకపై దాడి చేశాయని స్థానికులు తెలిపారు.