ప్రజా తీర్పును గౌరవిస్తం: ఇంద్రకరణ్ రెడ్డి

ప్రజా తీర్పును గౌరవిస్తం: ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్, వెలుగు: ప్రజా తీర్పును గౌరవిస్తామని నిర్మల్​జిల్లాలో ఓటమి చెందిన అభ్యర్థులు పేర్కొన్నారు. తమ ఓటమి ఖరారు కాగానే  కౌంటింగ్ కేంద్రంలో బీఆర్​ఎస్, కాంగ్రెస్​అభ్యర్థులు ఇంద్రకరణ్​రెడ్డి, శ్రీహరిరావు​బయటకు వస్తూ మాట్లాడారు.

తాను మంత్రిగా పదేండ్లపాటు నియోజకవర్గ ప్రజలకు సేవలందించానని, ఈ ఎన్నికల్లో ప్రజా తీర్పును గౌరవిస్తానని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మరో ఐదేండ్లపాటు ప్రజలకు సేవలందించాలని పోటీ చేశానని, కానీ వారు తనను తిరస్కరించారని పేర్కొన్నారు. వారి నిర్ణయాన్ని గౌరవించి ప్రజాసేవలో కొనసాగుతానని వెల్లడించారు.


సేవ చేసేందుకే పోటీ చేశా..


ప్రజలకు సేవలందించేందుకు ఎన్నికల్లో పోటీ చేశానని, అయితే ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని శ్రీహరి రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నందున తాను మరింత ఉత్సాహంతో పనిచేస్తానన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనుందని పేర్కొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు తాను పని చేస్తానని చెప్పారు.