Job Notification: డీఆర్డీఓలో పెయిడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు భర్తీ.. వివరాలు ఇవే..!

Job Notification: డీఆర్డీఓలో పెయిడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు భర్తీ.. వివరాలు ఇవే..!

డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డీఆర్​డీఓ(డీఎంఆర్ఎల్ డీఆర్​డీఓ) పెయిడ్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 25. 

పోస్టుల సంఖ్య : 20 (పెయిడ్ అప్రెంటీస్)

ALSO READ : TCIL Jobs : HR.. ట్రైనీ ఇంజినీర్ పోస్టులు భర్తీ..!

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 6.0 సీజీపీఏతో ఇంజినీరింగ్ డిగ్రీతోపాటు ఇంజినీరింగ్/ సైన్స్ విభాగంలో  పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 28 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

లాస్ట్ డేట్: జులై 27.

సెలెక్షన్ ప్రాసెస్ : పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

స్టైఫండ్ : ప్రతి నెల రూ.5000 చొప్పున ఆరు నెలలపాటు చెల్లిస్తారు. 

పూర్తి వివరాలకు drdo.gov.in వెబ్​సైట్​లో  సంప్రదించగలరు.