డీఆర్డీవో కరోనా మందు రిలీజ్.. ఢిల్లీకి 10 వేల ప్యాకెట్లు

డీఆర్డీవో కరోనా మందు రిలీజ్.. ఢిల్లీకి 10 వేల ప్యాకెట్లు

కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్ లో కీలకం కానున్న DRDO 2 డీఆక్సీ-డీగ్లూకోజ్ మందును రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ రిలీజ్  చేశారు. 10 వేల ప్యాకెట్లను ఢిల్లీలోని కొన్ని హాస్పిటల్స్ అందించారు. పొడి రూపంలో 2DG మందు వస్తుంది. దీనిని నీటిలో కలుపుకుని తాగాల్సి ఉంటుంది. DRDO అభివృద్ధి చేసిన 2DGని  హైదరాబాద్ కు చెందిన రెడ్డీస్ ల్యాబ ఉత్పత్తి చేస్తోంది. ఈ మందు అత్యవసర వాడకానికి ఈ మధ్యే డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా  అప్రూవల్ ఇచ్చింది. రెండు, మూడు దశల ట్రయల్స్ లో మంచి ఫలితాలు రావడంతో... ఎమర్జెన్సీ అనుమతి వచ్చింది. 2DG మందుతో కరోనా పేషెంట్లకు ఆక్సిజన్ అవసరం తగ్గుతుందని, హాస్పిటల్స్ లో ఉండాల్సిన రోజులు తగ్గుతాయని చెబుతున్నారు. ఇది అన్ని వయసుల వారికి పనిచేస్తుందని DRDO తెలిపింది. 2DG తీసుకున్న పేషెంట్లలో రెండు మూడు రోజుల్లోనే తేడా కనిపించిందని వివరించింది.  2DGని గతంలో క్యాన్సర్ కోసం తయారు చేశారు. శరీరంలో క్యాన్సర్ కణాలకు గ్లూకోజ్ అంతకుండా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇదే నియమాన్ని కరోనాకు అప్లై చేస్తూ రీసెర్చ్ చేశారు. శరీరంలో ప్రవేశించిన కరోనా వైరస్ కణాలకు గ్లూకోజ్ కణ విభజన జరగదని... దాంతో శరీరంలో కరోనా వైరస్ స్ప్రెడ్ ఆగుతుందని DRDO తెలిపింది.