
జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి దుర్మార్గులను వదిలేది లేదన్నారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. ఆ తీవ్రవాదులు ప్రపంచంలోని ఏ మూల దాక్కుని ఉన్నా.. సప్త సముద్రాల అవతల ఉన్నా లాక్కొచ్చి శిక్షిస్తామన్నారాయన. సృష్టించిన రక్తపాతానికి.. అంతకు అంత అనుభవిస్తారని.. ఈ విషయంలో ఎంత దూరం వెళ్లటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు రాజ్ నాథ్ సింగ్.
పహల్గాంలో దాడి చేసినోళ్లనే కాదు.. దాడికి వెనక ఉన్న వాళ్లను కూడా వదిలేది లేదని.. వాళ్లందరికీ అతి త్వరలోనే గట్టిగా గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారాయన. భారత్ చూపించే తెగువకు.. ప్రతీకారానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారాయన.
Also Read:-సెల్ఫీ దిగిన టెర్రరిస్టులు..పహల్గాం దాడికి ముందు ఎలా ఉన్నారో చూడండి
పహల్గాంలో ఓ మతాన్ని టార్గెట్ చేసి మరీ దాడులు చేయటం, కాల్పులు జరపటం పిరికిపంద చర్య అని.. చర్యకు ప్రతి చర్య ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్. దేశానికి భరోసా ఇస్తు్న్నాను.. నిందితులకు త్వరలోనే భారత్ దెబ్బ రుచి చూపిస్తామంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు రాజ్ నాథ్ సింగ్.