పైలట్ అభినందన్ కు రక్షణ మంత్రి పరామర్శ

పైలట్ అభినందన్ కు రక్షణ మంత్రి పరామర్శ
  • ఎయిర్ ఫోర్స్ చీఫ్ తో భేటీ అయిన అభినందన్ 
  • శుక్రవారం రాత్రి అభినందన్ ఎయిర్ ఫోర్స్ కు ఏం చెప్పాడు?

ఢిల్లీ : ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్, మిగ్ విమానం పైలట్ అభినందన్ వర్దమాన్ ను ఢిల్లీలోని ఎయిర్ ఫోర్స్ హాస్పిటల్ లో  పరామర్శించారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. నిన్న శుక్రవారం రాత్రి 9.20 నిమిషాలకు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అభినందన్ ను పాకిస్థాన్ విడుదలచేసింది. వాఘా-అటారీ బోర్డర్ దగ్గర భారత్ కు అప్పగించింది. ఆ తర్వాత అభినందన్ ను అమృత్ సర్ కు… అమృత్ సర్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు ఎయిర్ ఫోర్స్ అధికారులు. అభినందన్ కు గాయాలు కావడంతో.. ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ఫిబ్రవరి 26న జరిగిన ఆపరేషన్  .. పాకిస్థాన్ అధికారులు వ్యవహరించిన తీరుపై అభినందన్ ను వివరాలు అడిగి తెల్సుకున్నారు నిర్మలా సీతారామన్.

ఎయిర్ ఫోర్స్ మెస్ లో అభినందన్ ను ఉంచి డిబ్రీఫింగ్ చేస్తున్నారు అధికారులు. ఈ ఉదయం ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీఎస్ ధనోవాతో అభినందన్ భేటీ అయినట్టు వైమానిక దళ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ లో తాను ఎలా బందీ అయ్యానో.. ఖైదీగా ఎలా ట్రీట్ చేశారో అభినందన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కు వివరించినట్టు చెప్పారు. 

శుక్రవారం రాత్రి అభినందన్ ఎయిర్ ఫోర్స్ కు ఏం చెప్పాడు

మార్చి 1న పాకిస్థాన్ నుంచి అభినందన్ ను హ్యాండోవర్ చేసుకున్నారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు. ఫిజికల్ గా ఏమైనా దాడి చేశారా అని అడిగారు భారత అధికారులు. ఫిజికల్ గా కాదు గానీ.. మెంటల్ గా మాత్రం టార్చర్ పెట్టారని ఎయిర్ ఫోర్స్ కు చెప్పారు అభినందన్. తన లక్ష్యాల గురించి… ఎయిర్ ఫోర్స్ వ్యూహాల గురించి గుచ్చి గుచ్చి అడిగినట్టు వివరించారు. ఫిజికల్ గా ధైర్యంగా ఉన్నా కూడా… మెంటల్ గా తాను చాలా ఇబ్బందిపడినట్టు వైమానిక దళ అధికారులకు చెప్పారు అభినందన్.