రాహుల్.. భారత్ అప్పటిలా బలహీనంగా లేదు

రాహుల్.. భారత్ అప్పటిలా బలహీనంగా లేదు

లక్నో: భారత్ ఏం చెప్పినా ప్రపంచం శ్రద్ధగా వింటోందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఒకప్పటిలా  భారత్ బలహీనంగా లేదని.. ప్రస్తుతం ఇండియా శక్తిమంతంగా ఉందని ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల సభలో రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. ఉరి, పుల్వామా అటాక్ తర్వాత పాకిస్థాన్ టెర్రరిస్టులను వారి సొంత గడ్డ మీదే మన జవాన్లు ఎలా మట్టుబెట్టారో అందరూ చూశారన్నారు. తద్వారా మనం శత్రు దేశాలకు బలమైన సందేశాన్ని పంపామన్నారు. ‘మనం ఏం మాట్లాడినా దునియా శ్రద్ధగా ఆలకిస్తోంది. ఇప్పుడు భారత్ బలహీనం కాదు. గల్వాన్ లోయ ఘర్షణల్లో కేవలం ముగ్గురు చైనా సైనికులు మాత్రమే మరణించారని రాహుల్ గాంధీ అంటున్నారు. కానీ ఓ విషయం స్పష్టం చేయాలి. ఆ ఘర్షణల్లో 38 నుంచి 50 మంది దాకా చైనా జవాన్లు చనిపోయారు. మన దేశ సరిహద్దులు చాలా సురక్షితంగా ఉన్నాయి’ అని రాజ్ నాథ్ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

సినిమాలకు గుడ్బై.. ఇకపై నటించను

ఒక రాత్రి వీళ్లకు కళ్లు కనబడకుండా చూడు

నరంలేని నాలుక ఇంకా ఎన్ని అబద్దాలాడుతుంది?