సినిమాలకు గుడ్బై.. ఇకపై నటించను

సినిమాలకు గుడ్బై.. ఇకపై నటించను

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇకపై సినిమాల్లో నటించనని అతడు స్పష్టం చేశాడు. 2022 తర్వాత మూవీల్లో నటించబోనని ప్రకటించాడు. ఎవరేమనుకున్నా ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నాడు. ఎవరేమనున్నా పట్టించుకోనని ట్వీట్ చేశాడు. అయితే కెరీర్ లో పీక్స్ లో ఉన్న సమయంలో రాహుల్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడనేది మాత్రం క్లారిటీ రాలేదు. దీనిపై అతడు కూడా కారణాలను వెల్లడించలేదు. ‘అర్జున్ రెడ్డి, జాతిరత్నాలు’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులు చూరగొన్న రాహుల్.. హఠాత్తుగా నటనకు గుడ్ బై చెప్పాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నాడా అని టాలీవుడ్ వర్గాలతోపాటు తెలుగు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.

మరిన్ని వార్తల కోసం:

విశ్లేషణ: శూద్రులు నిలబెడుతున్న.. రామానుజ కీర్తి

సీఎం దత్తత పట్టణంలో చిత్ర విచిత్రాలు

చనిపోయిన వ్యక్తికి వ్యాక్సిన్​ వేశారట!