విటమిన్​ బి–12 తగ్గితే...

విటమిన్​ బి–12 తగ్గితే...

బరువు తగ్గడానికి పాటించే డైట్​ల వల్ల  కొన్నిరకాల విటమిన్లు శరీరానికి  అందవు. వాటిలో విటమిన్ బి–12 ఒకటి. విటమిన్–డి లెక్కనే అన్ని వయసు వాళ్లలో ముఖ్యంగా టీనేజర్స్​లో ఈ విటమిన్ లోపం ఎక్కువగా కనిపిస్తోంది అంటోంది జనరల్ ఫిజీషియన్ సంజల్ నగర్కర్. 

ఎర్ర రక్తకణాల తయారీకి విటమిన్ బి–12 చాలా అవసరం. ఈ విటమిన్​ తక్కువైతే రక్తహీనత  వస్తుంది. ఇన్​ఫ్లమేషన్, అలసటతో పాటు జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు కూడా మొదలవుతాయి. ఇవేకాకుండా నడిచేటప్పుడు ఇబ్బంది, తిమ్మిర్లు పట్టడం, ఆకలి తగ్గిపోవడం, వాంతి చేసుకోవడం, డయేరియాతో పాటు మానసిక ఒత్తిడి వంటి లక్షణాలు కనిపిస్తాయి.  కొన్నిసార్లు నాడీసంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ లక్షణాలు కనిపిస్తే డాక్టర్​ని కలిసి, విటమిన్ బి–12 కోసం ఏమేం తినాలో తెలుసుకోవాలి. ఇవి తినాలి.  పాల పదార్థాలు, బాదం, సాల్మన్ చేపలు, చికెన్, గుడ్లు, పుట్టగొడుగుల్లో విటమిన్ బి–12 ఉంటుంది. సప్లిమెంట్స్ తీసుకున్నా కూడా విటమిన్​ బి–12 లోపం ఏర్పడకుండా చూసుకోవచ్చు.