డిగ్రీ పరీక్షల్లో ఎక్కువ చాయిస్ ప్రశ్నలు

డిగ్రీ పరీక్షల్లో ఎక్కువ చాయిస్ ప్రశ్నలు
  • ఎగ్జామ్ పేపర్ లో చాయిస్ పెంపు
  • ఉన్నత విద్యామండలి నిర్ణయం
  • పీజీ సీట్ల కోసం మరో ఫేజ్ కౌన్సిలింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ స్టూడెంట్లకు ఈనెల 28 నుంచి ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. శనివారం ఉస్మానియా, కాకతీయ, టీయూ, ఎంజీయూ, శాతవాహన, పాలమూరు తదితర వర్సిటీల వీసీలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్​ చైర్మన్​వెంకటరమణ వర్చువల్‌‌‌‌‌‌‌‌గా సమావేశమయ్యారు. కరోనా కారణంగా స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌లో ఎగ్జామ్స్​పట్ల ఏర్పడిన భయాన్ని తొలగించేందుకు ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌ పేపర్లలో చాయిస్‌‌‌‌‌‌‌‌ పెంచాలని నిర్ణయించామని లింబాద్రి తెలిపారు. పరీక్షా సమయాన్ని రెండున్నర గంటల నుంచి 3 గంటలకు పెంచనున్నట్టు వివరించారు. ఈనెల17 లాస్ట్ టీచింగ్ డే అని, 18 నుంచి 25 వరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌‌‌‌‌‌‌‌ జరుగుతాయని అన్నారు. ఈనెల 28 నుంచి మార్చి 24 వరకు డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ థియరీ పరీక్షలుంటాయని చెప్పారు.

మరో ఫేజ్ సీపీగెట్ కౌన్సెలింగ్
వివిధ వర్సిటీల పరిధిలోని కాలేజీల్లో పీజీ కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మరో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు టీఎస్‌‌‌‌‌‌‌‌సీహెచ్‌‌‌‌‌‌‌‌ఈ చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు.