కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్ మరింత ఆలస్యం !

కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్ మరింత ఆలస్యం !

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్​మరింత ఆలస్యం కానుంది. ఈ అంశానికి సంబంధించి త్రిమెన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ఇంటర్ అధికారులకు చేరింది. వాళ్లు దాన్ని సర్కారుకు పంపాలని సిద్ధమవుతుండగా.. అధికారులకు సర్కారు మరో పని అప్పగించింది. కొత్త జోనల్ విధానంలో కాకుండా పాత జోనల్ విధానంలో లిస్టులు పంపించాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే లొకాలిటీ ఫైల్ ఓకే అయినా, పాత జోనల్ విధానంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరింత టైమ్ పట్టే అవకాశముండటంతో.. 3,500 మంది కాంట్రాక్టు లెక్చరర్లలో అయోమయం నెలకొన్నది.