మస్కిటో కాయిల్ వల్ల చనిపోతారా.. ఆ ఆరుగురి మరణానికి అదే కారణమా

మస్కిటో కాయిల్ వల్ల చనిపోతారా.. ఆ ఆరుగురి మరణానికి అదే కారణమా

దోమలు బాబోయ్ దోమలు.. ప్రశాంతంగా నిద్ర పట్టటానికి మస్కిటో కాయిల్ పెట్టుకోవటం కామన్.. అయితే అదే మస్కిటో కాయిల్ దోమలను చంపుతుందో లేదో కానీ.. ఆరుగురి మాత్రం చంపేసింది.. ఇది జరిగింది ఎక్కడో కాదు.. దేశ రాజధాని ఢిల్లీలో.. మస్కిటో కాయిల్ వల్ల ఆరుగురు ఎలా చనిపోయారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం అయ్యింది. పోలీసుల ప్రాథమిక విచారణ తర్వాత వెల్లడించిన వివరాల ప్రకారం.. 

ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఆరుగురు వ్యక్తులు నివాసం ఉంటున్నారు. మార్చి 31వ తేదీ శుక్రవారం ఉదయం వాళ్లు బయటకు రాలేదు.. దీనికితోడు ఇంట్లో నుంచి పొగ వస్తుండటంతో స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ఆరుగురు వ్యక్తులు చనిపోయి ఉన్నారు. గది మొత్తాన్ని పరిశీలించగా.. మస్కిటో కాయిల్ వల్ల చనిపోయినట్లు ప్రాథమికంగా నిర్థారించారు పోలీసులు.

రాత్రి సమయంలో ఇంటి తలుపులు, కిటికీలు అన్ని మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించారు. దీంతో గదిలోని ఆక్సీజన్ మొత్తం కార్బన్ డయాక్సిడ్ గా మారిపోయి.. ఊపిరిఆడక.. నిద్రలోని చనిపోయినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇంట్లోకి దోమలు రాకుండా అన్ని తలుపులు, కిటికీలు మూసివేసి.. మస్కిటో కాయిల్స్ వెలిగించటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు. 

మృతి చెందిన వారి వివరాలు ఏంటీ.. ఎక్కడి వారు అనే విషయాలపై దర్యాప్తు కొనసాగుతుందని స్పష్టం చేశారాయన. ఆరుగురి మరణం వెనక ఎలాంటి కుట్రలు లేవని.. హత్యలు కాదని వెల్లడించారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతుందని వివరించారు పోలీసులు.