ఆ 8 రోజులు.. ఆ రెండు గంటలు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మూసివేత

ఆ 8 రోజులు.. ఆ రెండు గంటలు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ మూసివేత

ఎప్పుడూ రద్దీ గా ఉండే ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్.. దేశంలోనే అత్యధికంగా విమానాల రాకపోకలు ఇక్కడినుంచి జరుగుతుంటాయి. రోజు వేలల్లో ప్రయాణికులు విదేశాలకు పోతుంటారు..వస్తుంటారు. అలాంటి విమానాశ్రయంలో ఆ 8 రోజులు..రోజు 2 గంటల పాటు విమానాల రాకపోకలు ఉండవు..ఎందుకో తెలుసుకుందాం రండి.. 

గణతంత్ర దినోత్సవ వేడుకలు, అయోధ్య రామ మందిరంలో జరిగే పవిత్రోత్సవాల సందర్భంగా ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.. జనవరి 22, జనవరి 26 తేదీల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా నే జనవరి 19 నుంచి జనవరి 26 వరకు ప్రతి రోజు ఉదయం 10.20 గంట లనుంచి 12.45 గంటల వరకు ఎటువంటి విమానాలు నడపడానికి అనుమతి లేదని శుక్రవారం (జనవరి19) కేంద్ర ప్రభుత్వం నోటీసు జారీ చేసింది. 

రిపబ్లిక్ డే సన్నాహాలు, రామ మందిరంలో పవిత్రోత్సవ వేడుకలకు  సందర్భంగా దేశ రాజధానిలో శుక్రవారం (జనవరి 19) నుంచి జనవరి 26 వరకు ఎయిర్ స్పేస్ నియంత్రణ అమలు ఉంటుంది. జనవరి 19-26 మధ్య కాలంలో షెడ్యూల్డ్ ఎయిర్ లైన్స్, చార్టర్డ్ విమానాలు, నాన్ షెడ్యూల్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ లను ఉదయం 10.20 గంటల నుంచి 12.45 గంటల వరకు అనుమతించ బడవు. 

IAF, BSF, ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లు, గవర్నర్, సీఎం ప్రయాణంచే ప్రభుత్వం యాజమాన్యంలోని విమానాలు, హెలికాప్టర్లకు అనుమతి ఉంటుంది. 

జనవరి 26న జరిగే రిపబ్లిక్ డే కవాతు కోసం ఇప్పటికే ఢిల్లీ అంతటా 8వేల మందికి పైగా పోలీసు సిబ్బంది మోహరించారు.హోటళ్లు, గెస్ట్ హౌస్ లు,  రైల్వే స్టేషన్లు, అంతర్ రాష్ట్ర బస్ స్టేషన్ల దగ్గర భద్రతను పెంచారు. వచ్చి పోయే ప్రయాణికులను తనిఖీ చేస్తున్నారు. రాత్రి పెట్రోలింగ్ కట్టుదిట్టం చేశారు.