DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్

DC vs SRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ.. మార్పుల్లేకుండానే సన్ రైజర్స్

ఐపీఎల్ లో నేడు ఆసక్తికర సమరం జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 7 మ్యాచ్ ల్లో 3 మ్యాచ్ ల్లో గెలుపొంది ఆరోస్థానంలో ఉంది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఇప్పటినుంచి ప్రతి మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచి తమ ఖాతాలో రెండు పాయింట్లు వేసుకుంటారో చూడాలి. 

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI):

డేవిడ్ వార్నర్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, అభిషేక్ పోరెల్, రిషబ్ పంత్(వికెట్ కీపర్, కెప్టెన్ ), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నార్టే, ఖలీల్ అహ్మద్, ముఖేష్ కుమార్

సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI):

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మార్క్‌రామ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్ ), అబ్దుల్ సమద్, నితీష్ రెడ్డి, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టి నటరాజన్