పంత్ పటాకా..టైటాన్స్‌‌‌‌ను మళ్లీ ఓడించిన ఢిల్లీ  

పంత్ పటాకా..టైటాన్స్‌‌‌‌ను మళ్లీ ఓడించిన ఢిల్లీ  

న్యూఢిల్లీ : టీ20 వరల్డ్ కప్‌‌‌‌ టీమ్ సెలక్షన్ ముంగిట రిషబ్ పంత్ (43 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 నాటౌట్‌‌‌‌) తన తడాఖా చూపెట్టాడు. రీఎంట్రీలో తన స్టామినా తగ్గలేదని నిరూపిస్తూ..  ఖతర్నాక్ షాట్లతో గుజరాత్ టైటాన్స్‌‌‌‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతనికి తోడు  అక్షర్ పటేల్ (43 బాల్స్‌‌‌‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 66; 1/28) ఆల్‌‌‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌‌‌తో సత్తా చాటడంతో జీటీపై ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ మరోసారి పైచేయి సాధించింది. బుధవారం జరిగిన థ్రిల్లింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గుజరాత్ 4 రన్స్‌‌‌‌ తేడాతో ఢిల్లీ చేతిలో ఓడింది.  తొలుత ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌ 20 ఓవర్లలో 224/4 స్కోరు చేసింది.

సందీప్ వారియర్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేజింగ్‌‌‌‌లో జీటీ ఓవర్లన్నీ ఆడి 220/8 స్కోరు చేసింది. సాయి సుదర్శన్ (39 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 65), డేవిడ్ మిల్లర్ (23 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) ఫిఫ్టీలకు తోడు చివర్లో రషీద్ ఖాన్ (21 నాటౌట్‌‌‌‌) పోరాడినా ఫలితం లేకపోయింది. రసిఖ్‌‌‌‌ ధార్ మూడు, కుల్దీప్ రెండు వికెట్లు తీశారు. పంత్‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. 

113 రన్స్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్​

టాస్ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన ఢిల్లీ పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి 44/3తో డీలా పడింది. కానీ, అక్షర్‌‌‌‌‌‌‌‌ అండగా కెప్టెన్ పంత్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో భారీ స్కోరు చేయగలిగింది. ఆరంభంలో మాత్రం జీటీ పేసర్ సందీప్ వారియర్ వరుస వికెట్లతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టాడు. ఫామ్‌‌‌‌లో ఉన్న  జేక్ ఫ్రేజర్‌‌‌‌‌‌‌‌ (23), పృథ్వీ షా (11) తొలి మూడు ఓవర్లలో జోరు చూపెట్టారు. కానీ, నాలుగో ఓవర్లో ఇద్దరినీ ఔట్ చేసిన వారియర్‌‌‌‌‌‌‌‌ ఢిల్లీకి షాకిచ్చాడు. తన తర్వాతి ఓవర్లోనే షై హోప్ (5)ను కూడా పెవిలియన్‌‌‌‌ చేర్చాడు.

ఈ దశలో పంత్, అక్షర్‌‌‌‌‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ బాధ్యతను భుజాలపై వేసుకున్నారు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న ఈ ఇద్దరూ తర్వాత బ్యాట్లకు పని చెప్పారు. రషీద్ వేసిన ఎనిమిదో ఓవర్లో సిక్స్‌‌‌‌తో అక్షర్ జోరందుకోగా.. నూర్‌‌‌‌‌‌‌‌ అహ్మద్ వేసిన 11వ ఓవర్లో స్లాగ్ స్వీప్ షాట్‌‌‌‌తో పంత్ సిక్సర్ల ఖాతా తెరిచాడు. ఇద్దరి జోరుతో 12వ ఓవర్లో స్కోరు వంద దాటింది. షారూక్ బౌలింగ్‌‌‌‌లో సిక్స్‌‌‌‌, రషీద్‌‌‌‌ ఓవర్లో ఫోర్‌‌‌‌‌‌‌‌తో అక్షర్ (37 బాల్స్‌‌‌‌) ఫిఫ్టీ పూర్తి చేసుకోగా 15 ఓవర్లకు ఢిల్లీ 127/3తో నిలిచింది. ఈ లెక్కన ఆ టీమ్ 180–190 రన్స్‌‌‌‌ చేసేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో పంత్‌‌‌‌ ఒక్కసారిగా టాప్ గేర్‌‌‌‌‌‌‌‌లోకి వచ్చేశాడు. మోహిత్ వేసిన 16వ ఓవర్లో రెండు సిక్సర్లతో అలరించాడు. నూర్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టిన అక్షర్ తర్వాతి బాల్‌‌‌‌కు ఔట్ అవడంతో  నాలుగో వికెట్‌‌‌‌కు

113  రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్ షిప్ ముగిసింది. మోహిత్ వేసిన 18వ ఓవర్లో సిక్స్‌‌‌‌తో 34 బాల్స్‌‌‌‌లో పంత్  ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సాయి కిషోర్ బౌలింగ్‌‌‌‌లో ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (7 బాల్స్‌‌‌‌లో 26 నాటౌట్‌‌‌‌) వరుసగా 4, 6, 4, 6తో రెచ్చిపోయాడు. మోహిత్ వేసిన చివరి ఓవర్లో పంత్‌‌‌‌ విశ్వరూపం చూపెట్టాడు. తన మార్కు షాట్లతో  వరుసగా 6, 4, 6, 6, 6 స్టేడియాన్ని హోరెత్తిస్తూ  ఇన్నింగ్స్‌‌‌‌కు అదిరిపోయే ఫినిషింగ్ ఇచ్చాడు. స్టబ్స్‌‌‌‌, పంత్ దెబ్బకు  చివరి రెండు ఓవర్లలోనే ఢిల్లీ 53 రన్స్ రాబట్టింది.

మిల్లర్, సుదర్శన్​ పోరాడినా

భారీ టార్గెట్ ఛేజింగ్‌‌‌‌లో జీటీకి శుభారంభం లభించలేదు. ఐపీఎల్‌‌‌‌లో తన వందో మ్యాచ్‌‌‌‌లో ఓపెనర్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్ గిల్ (6) ఫెయిలయ్యాడు. నార్జ్‌‌‌‌ వేసిన రెండో ఓవర్లో పెవిలియన్‌‌‌‌ చేరాడు. అయితే మరో ఓపెనర్ సాహా (39), ఇంపాక్ట్ ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా వచ్చిన సాయి సుదర్శన్ దంచికొట్టారు. ఎదుర్కొన్న తొలి బాల్‌‌‌‌నే సిక్స్‌‌‌‌గా మలిచిన సుదర్శన్ దూకుడుగా బ్యాటింగ్‌‌‌‌ చేశాడు. ఖలీల్ వేసిన మూడో ఓవర్లో సాహా రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో అలరించగా.. సాయి కూడా జోరు చూపడంతో పవర్‌‌‌‌‌‌‌‌ప్లేలో గుజరాత్ 67/1 స్కోరు చేసింది. స్పిన్నర్ల రాకతో  జీటీ  స్పీడుకు బ్రేకులు పడ్డాయి.

కుల్దీప్ వేసిన పదో ఓవర్లో సాహా .. అక్షర్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్ ఇవ్వడంతో రెండో వికెట్‌‌‌‌కు 82 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్ ముగిసింది.  మూడు బాల్స్‌‌‌‌ తర్వాత ఓమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌ (1)ను అక్షర్ ఔట్‌‌‌‌ చేశాడు. ఫిఫ్టీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్‌‌‌‌తో పాటు షారూక్‌‌‌‌ ఖాన్‌‌‌‌ (8)ను తన వరుస ఓవర్లలో ఔట్‌‌‌‌ చేసిన రసిఖ్  జీటీని దెబ్బకొట్టాడు. మిల్లర్‌‌‌‌ పోరాడుతున్నా కుల్దీప్ బౌలింగ్‌‌‌‌లో  రాహుల్ తెవాటియా (4) కీపర్ పంత్‌‌‌‌కు క్యాచ్‌‌‌‌ ఇవ్వడంతో మ్యాచ్‌‌‌‌ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లింది. కానీ, 24 బాల్స్‌‌‌‌లో 73 రన్స్‌‌‌‌ అవసరమైన టైమ్‌‌‌‌లో మిల్లర్‌‌‌‌‌‌‌‌ ఒక్కసారిగా విజృంభించాడు. నార్జ్ వేసిన 17వ ఓవర్లో  4,6, 6, 6 కొట్టి జట్టును రేసులోకి తీసుకొచ్చాడు.

ముకేశ్‌‌‌‌ వేసిన తర్వాతి ఓవర్లో రషీద్‌‌‌‌ ఇచ్చిన క్యాచ్‌‌‌‌ను పోరెల్ డ్రాప్‌‌‌‌ చేయగా రెండు బాల్స్‌‌‌‌ తర్వాత మిల్లర్‌‌‌‌‌‌‌‌ ఔటయ్యాడు. 19వ  ఓవర్లో రషీద్ ఫోర్‌‌‌‌‌‌‌‌ బాదగా, సాయి కిశోర్ (13) రెండు సిక్సర్లు కొట్టి లాస్ట్ బాల్‌‌‌‌కు బౌల్డ్ అయ్యాడు. చివరి ఓవర్లో జీటీకి 19 రన్స్‌‌‌‌ అవసరం అయ్యాయి. రషీద్ రెండు ఫోర్లు, సిక్స్‌‌‌‌తో ఢిల్లీని వణికించాడు. కానీ, ఆఖరి బాల్‌‌‌‌కు విజయానికి అవసరమైన సిక్స్‌‌‌‌ కొట్టలేకపోవడంతో ఢిల్లీ ఊపిరిపీల్చుకుంది.

0/73 ఈ మ్యాచ్‌‌‌‌లో  జీటీ బౌలర్‌‌‌‌‌‌‌‌ మోహిత్ శర్మ పెర్ఫామెన్స్‌‌‌‌. ఐపీఎల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఎక్కువ రన్స్‌‌‌‌ ఇచ్చిన బౌలర్‌‌‌‌‌‌‌‌గా చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.  2018లో సన్‌‌‌‌ రైజర్స్‌‌‌‌ బౌలర్‌‌‌‌‌‌‌‌ బాసిల్ థంపి ఆర్‌‌‌‌‌‌‌‌సీబీపై 70 రన్స్‌‌‌‌ ఇచ్చిన రికార్డు బ్రేక్ అయింది.

సంక్షిప్త స్కోర్లు

ఢిల్లీ : 20 ఓవర్లలో 224/4 (పంత్ 88*, అక్షర్ 66, సందీప్‌‌‌‌ వారియర్‌‌‌‌‌‌‌‌ 3/15)
గుజరాత్ : 20 ఓవర్లలో 220/8 (సుదర్శన్ 65, మిల్లర్ 55, రసిఖ్ 3/44)