
ఊపేసే ఉత్కంఠ లేదు..ఊహించని మలుపులు లేవు..సాదాసీదాగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా పై ఢిల్లీ పైచేయి సాధించింది. గతంలో రెండు జట్ల మద్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగిన సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలితే తాజా మ్యాచ్ లో ధవన్ చెలరేగడంతో ఢీల్లీ వన్ సైడ్ విక్టరీ కొట్టింది. మొదట ,గిల్ ,రసెల్ మెరుపులతో ఓ మోస్తరు స్కోరు చేసిన కోల్ కతా ..బౌలింగ్ లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేక రెండో ఓటమి మూటగట్టుకుంది.
కోల్ కతా: టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 63 బంతుల్ లో 11 ఫోర్లు, 2 సి క్సర్లతో 97 నాటౌట్ )అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఈసీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ రెండో విజయం నమోదు చేసుకుంది. రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ లో ఉత్కంఠ ఊపేసి చివరికి సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేలితే.. శుక్రవారం మ్యాచ్ లో ఢిల్లీ ఈజీగా గెలిచింది. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో కోల్ కతాపై నెగ్గింది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 రన్స్‌చేసింది. అరంభంలో ఓపెనర్ శుభ్ మన్ గిల్ (39బంతుల్ లో 7 ఫోర్లు, 2 సి క్సర్లతో 65), ఆఖర్లో డేంజర్ మ్యాన్ రసెల్ (21 బంతుల్ లో 3 ఫోర్లు, 4సిక్సర్లతో 45) అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలోమోరిస్ , రబాడ, పాల్ రెండేసి వికెట్లు పడగొట్టారు.టార్గెట్ ఛేజింగ్‌లో ఢిల్లీ 18.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 180 రన్స్ చేసి గెలిచింది.ధవన్ కు తోడు రిషబ్ పంత్ (31 బంతుల్ లో 4ఫోర్లు, 2 సి క్సర్లతో 46) కూడా చెలరేగితే.. ఆఖర్లోఇంగ్రామ్ (6 బంతుల్ లో ఫోర్ , సి క్సర్ తో 14నాటౌట్ ) ధవన్ సెంచరీ అవకాశాలపై నీళ్లు చల్లుతూ భారీ సిక్సర్ తో ఇన్నింగ్స్ ను ముగించాడు. శిఖర్ ధవన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
దంచికొట్టిన ధవన్
గత నాలుగు మ్యాచ్ ల్లో పెద్దగా ప్రభావం చూప లేకపోయిన ధవన్ బ్యాట్ ఎట్టకేలకు స్వింగ్‌లోకివచ్చింది. చూడ చక్కటి షాట్లతో చెలరేగిన శిఖర్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ఛేజింగ్‌లోఢిల్లీ అలవోక విజయం సాధించింది. కోల్ కతాతో జరిగిన లాస్ట్ మ్యాచ్ లో ఒక్క రన్ తో సెం చరీ మిస్ చేసుకున్న యంగ్ తరంగ్ పృథ్వీ షా కూడా ఉన్నంత సేపు చక్కటి షాట్లతో అలరించాడు.ఫెర్గూ సన్ వేసిన రెండో ఓవర్ లో రెండు సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత నుంచి ధవన్ జోరు స్టార్ట్ అయింది. ప్రసిధ్ వేసిన మూడో ఓవర్‌లో అతడు6,4,6తో చెలరేగిపోయాడు. అదే ఓవర్ చివరిబంతికి షా ఔట్ కావడంతో ఢిల్లీ 32 పరుగులవద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రసిధ్ చక్కటిస్వింగర్ తో పృథ్వీని బోల్తాకొట్టించాడు. అయినాజోరు తగ్గించని ధవన్ .. రసెల్ బౌలింగ్‌లోనూమూడు ఫోర్లతో రెచ్చి పోయాడు. తన సహజసిద్ధశైలిలో ఫ్లిక్ , కట్ షాట్ లతో ఫీల్డర్ల మధ్య నుంచి ఫోర్లు బాదుతుంటే.. స్కో రు బోర్డు ఉరకలెత్తింది.దీంతో5 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 55/1తోనిలిచింది. అయ్యర్ (6) నిరాశపరచడంతోస్కో రు వేగం మందగించినా.. పంత్ తో కలిసి అడపాదడపా బౌండ్రీలు కొడుతూ వచ్చి న ధవన్32 బంతుల్ లో హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా లేకపోవడంతో ఈ జోడీ ఎక్కడ తొందరపాటుకు పోకుండా ఆచితూచి ఆడింది. విజయానికి 48 బంతుల్ లో74 రన్స్ అవసరమైన దశలో.. ధవన్ రెండు, పంత్‌రెం డు ఫోర్లు బాదడంతో సమీకరణం 6 ఓవర్లలో49కి చేరింది. ఆ తర్వాత ధవన్ రెండు ఫోర్లు..పంత్ 4,6 కొట్టడంతో టార్గెట్ ఈజీగా మారింది.18 బంతుల్లో 17 రన్స్ చేయాల్సిన దశలో పంత్‌ఔటైనా.. ఇంగ్రామ్‌తో కలిసి ధవన్ మిగిలిన పనిపూర్తిచేశాడు.
స్టార్టింగ్ గిల్.. ఫినిషింగ్ రసెల్
టాస్ నెగ్గిన అయ్యర్ కోల్ కతాకు బ్యాటింగ్ అ ప్పగించాడు. వెటరన్ పే సర్ ఇషాంత్ శర్మఇన్నింగ్స్ తొలి బంతికే ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన జో డెన్లీ (0)ని గోల్డెన్ డక్ గా పెవిలియన్‌పంపి ఫస్ట్ ఓవర్ ను మెయిడిన్ గా ముగించాడు.మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్ , రాబిన్ ఊతప్ప (30బంతుల్ లో 4 ఫోర్లు, సి క్సర్ తో 28) జోడీ కాసే పుబౌండ్రీల వర్షం కురిపించింది. ఒక దశలో వీరిద్దరూ 10 బంతు ల వ్యవధిలో ఆరు ఫోర్లు బాదడంతో5 ఓవర్లు ముగిసేసరికి కోల్ కతా వికెట్ నష్టానికి40 రన్స్ చేసింది. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్లు పుంజుకోవడంతో పరుగుల రాక కష్టమైంది. ఈ క్రమంలో-నే రబాడ బంతిని హుక్ చేసే యత్నంలో ఊతప్ప పంత్ కు క్ యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. నిలకడగాఆడుతున్న గిల్ 34 బంతుల్ లో హా ఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. రా ణా (11) కూడా ఔటయ్యాడు.దీంతో13 ఓవర్లు ముగిసే సరికి నైట్ రైడర్స్111/3తో నిలిచింది. గిల్ కు రసెల్ జత కలిశాకస్కో ర్ వేగం పెరిగింది. అక్షర్ బౌలింగ్‌లో రసెల్‌ఓ ఫోర్ , గిల్ 6,4 బా దడంతో 16 రన్స్ వచ్చాయి.ఆ తర్వాత గిల్ , కార్తీ క్ (2) బ్రాత్ వైట్ (6) ఔటైనా..రసెల్ భారీ షాట్లతో విజృంభించాడు. రబాడబౌలింగ్‌లో 4,6.. మోరిస్ ఓవర్ లో ఓ సిక్స్ , ఆతర్వాత మళ్లీ రబాడ ఓవర్ లో 6,2,6తో ఫుల్ స్వింగ్‌లోకి వచ్చేశాడు. అతడి దూకుడు చూస్తుంటేరైడర్స్ ఇంకా ఎక్కువ స్కో రు చేసేలా కనిపించింది.కానీ 19వ ఓవర్ రెం డో బంతికి రసెల్ ఔటవడతోఓ మా దిరి స్కో రుకే పరిమితమైంది. చివర్లో చావ్లా (14 నాటౌట్ ) విలువైన పరుగులు చేశాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా: డెన్లీ (బి) ఇషాంత్ 0, గిల్ (సి) అక్షర్(బి) పాల్ 65, ఊతప్ప (సి) పంత్ (బి) రబాడ28, రా ణా (బి) మోరిస్ 11, రసెల్ (సి) రబాడ (బి) మోరిస్ 45, కార్తీ క్ (సి) ధవన్ (బి) రబాడ 2, బ్రాత్ వైట్ (సి) తెవాటియా (బి) పాల్ 6, చావ్లా (నాటౌట్ ) 14, కుల్దీప్ (నాటౌట్ ) 2;
ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 178/7
వికెట్ల పతనం: 1–0, 2–63, 3–93, 4–115, 5–122, 6–161, 7–171; బౌలింగ్:ఇషాంత్ 4–1–21–1, మోరిస్ 4–0–38–2,రబాడ 4–0–42–2, అక్షర్ 4–0–30–0, పాల్ 4–0–46–2.
ఢిల్లీ: పృథ్వీ షా (సి) కార్తీ క్ (బి) ప్రసిధ్ 14,ధవన్ (నాటౌట్) 97, శ్రేయస్ (సి) కార్తీ క్ (బి)రసెల్ 6, పంత్ (సి) కుల్దీప్ (బి) రా ణా 46,ఇంగ్రామ్ (నాటౌట్ ) 14;
ఎక్స్‌ట్రాలు: 3
మొత్తం: 18.5 ఓవర్లలో 180/3; వికెట్ల
వికెట్ల పతనం: 1–32, 2–57, 3–162,
బౌలింగ్:ప్రసిధ్ 3–0–25–1, ఫెర్గూ సన్ 3–0–37–0,రసెల్ 3–0–29–1, కుల్దీప్ 4–0–28–0,చావ్లా 2.5–0–35–0, బ్రాత్ వైట్ 1–0–13–0, రా ణా 2–0–12–1.